కూటమి ప్రభుత్వానికి గిరిజనులపై చిత్తశుద్ధి లేదు. ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి

Rtv Rahul
0
కూటమి ప్రభుత్వానికి గిరిజనులపై చిత్తశుద్ధి లేదు 

బడ్జెట్లో గిరిజనుల జనాభా ప్రకారం 20 వేల కోట్ల కేటాయించాలి 

ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన జీవో నెంబర్ 3 హామీకి చట్టబద్ధత కల్పించాలి 

ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి

RTVNEWS.కూటమి ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసిందని గిరిజనులపై చిత్తశుద్ధి లేదు అనడానికి ఇది నిదర్శనమని ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచిపెంట చిన్నస్వామి అన్నారు మంగళవారం విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనుల జనాభా ప్రకారం 20 వేల కోట్ల రూపాయల కేటాయించ వలసి ఉన్నప్పటికీ కేవలం 7వేల కోట్ల రూపాయలు కేటాయించడం సమంజసం కాదన్నారు. గిరిజన ప్రాంతం లో మంచినీటి ,రహదారి సౌకర్యం పాఠశాల భవనాలు ఐటీడీఏ పరిధిలో ఉండే బ్యాక్లాగ్ పోస్ట్లు ,స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ అలాగే ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఎటువైపు మళ్లించాలని అంకెల గారడి నిధులు కేటాయించడం జరిగిందని దీంతోగిరిజనులకు నిరాశ మిగిలిందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు బడ్జెట్లో నిరుద్యోగ భృతి అసెంబ్లీలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు 100% జీవో నెంబర్ 3 రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని ఆయన పోరారు ముందుగా జీవో నెంబర్ 3 చట్టబద్ధత కల్పించాలని ప్లే కార్డులు ప్రదర్శించి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులు జంపనంగి వెంకట బాబు పాంగి గంగాధర్ కొర్ర పోతురాజు మజ్జి శ్రీకాంత్ కార్యకర్తలు తదితరు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">