ఏఎల్ పురంలో 75వ రాజ్యాంగ దినోత్సవం
సర్పంచ్ లోచల సుజాత
. RTVNEWS( లవకుశ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అనేది గిరిజనులకు హరిజనులకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు వర ప్రధాయని లాంటిదని ఏయ ఎల్ పురం మేజర్ పంచాయతీ సర్పంచ్ లోచల సుజాత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో 75వరాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ లోచల సుజాత మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలో కల్లా ఉత్తమమైనదని అలాగే దీనిని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తిని ఆమె కొనియాడారు. రాజ్యాంగం ద్వారానే ప్రజలందరికీ రాజ్యపాలన అందుతుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గ్రామ పెద్దలు చింతల వాసుదేవరావు కూటమి నాయకులు, బొడ్డు జమీలు, చిటికెల చిట్టిబాబు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఝాన్సీ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు