ఈనెల 27న కొయ్యూరులో తెలుగుదేశం పార్టీ అత్యవసర సమావేశం
టిడిపి మండల ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు
RTVNEWS (లవకుశ)ఈ నెల 27న కొయ్యూరు మండలం సింగవరం జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లో తెలుగుదేశం పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాడేరు నియోజవర్గం ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి హాజరవుతున్నారని మండల టిడిపి పార్టీ ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ఎంపీపీలు, జడ్పిటిసిలు కార్యకర్తలు మహిళలు పార్టీ అభిమానులు సానుభూతిపరులు అందరు హాజరు కావాలని ఆయన కోరారు