గ్రామాల్లో ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ సర్వే
భూ రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్ అప్పన్న
RTVNEWS :కొయ్యూరుమండలంలో ఎంపిక చేసిన 25 గ్రామాల్లో ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ సర్వే నిర్వహించడం జరుగుతుందని భూ రీసర్వే డిప్యూటీ తాసిల్దార్ అప్పన్న అన్నారు. బుధవారం అంతడ పంచాయతీ ఎద్దు మామిడి సింగ ధార, నల్గొండ పంచాయతీ కొప్పుకొండ, బంగారంపేట పంచాయతీ పరదేశిపాకుల గ్రామాల్లో భూరీ సర్వే నిర్వహించడం జరిగిందని డిప్యూటీ తాసిల్దార్ అప్పన్న తెలిపారు. ఈ రీ సర్వే ఈ నెల 12 నుండి డిసెంబర్ 11 వరకు నిర్వహిస్తామన్నారు. మొదటి విడతగా మండలంలో 23 గ్రామాల్లో రీ సర్వే జరిగిందని, మరో 25 గ్రామాలను ఎంపిక చేసి వీ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ మూర్తి రైతులు పాల్గొన్నారు