ఇల్లు సమస్యలపై ఈ నెల 22న గ్రామ సచివాలయం వద్ద ఆందోళనలు
సిపిఐ పార్టీ మండల కార్యదర్శి "ఇరవాడ దేముడు"
RTVNEWS :పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలాలు కేటాయించి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల చొప్పున మంజూరు చేయాలని ఈ నెల 22న గ్రామ సచివాలయం వద్ద ఆందోళనలు చేపట్టనున్నట్లు భారత కమ్యూనిస్టు పార్టీ మండల కార్యదర్శి ఇరవాడ దేముడు తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ హయములో గ్రామాల్లో పేదలకు ఒకటిన్నర సెంట్లు పట్టణాల్లో ఒక చెట్టు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు ఆ ఇళ్ల స్థలాలు పట్టణాలకు సుదూరంగా నివాసయోగ్యం కానీ ప్రాంతాలలో కేటాయించడంతో చాలామంది పేదలకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు చూపెట్టలేదన్నారు ప్రభుత్వం ఇచ్చే సెంట్ ఉన్నారా సెంటు నివాసానికి ఏమాత్రం సరిపోవని భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఖాతర చేయకుండా నాటి ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లిందని అన్నారు అంతేకాకుండా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటికీ పేదలు ఆ స్థలాలు పట్ల చూపలేదు అన్నారు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం 1,80,000 మాత్రమే ప్రకటించారని ఆ నిధులతో ఇంటి పునాదులే పూర్తి అవ్వదని పేదలు ఇంటి నిర్మాణం చేపట్టలేదు అన్నారు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలు నిరుపియోగంగా మారాయని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో గండి చెట్లు చొప్పున ఇళ్ల స్థలాలు హామీ ఇచ్చారన్నారు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగిందన్నారు కానీ సిమెంటు ఇసుక కంకర ఇనుము వంటి సామాగ్రితరులు పెరిగిన రీత్యా ఐదు లక్షల కు పెంచి గృహ నిర్మాణానికి మంజూరు చేయాలన్నారు పేదల ఇల్లు నిర్మాణానికి సిమెంటు ఇసుక ఇనుము ఇటుకు ప్రభుత్వమే ఉచితంగా సర్ఫేర్ చేయాలన్నారు ఇళ్ల స్థలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వము పట్టణాల్లో గ్రామాల్లో నిరుపయోగంగా గృహ నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించాలని వైసీపీ ప్రభుత్వం హాయంలో ఏర్పాటు చేసిన లేవాట్లు మార్చి పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాలు రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి రోడ్లు విద్యుత్తు త్రాగునీరు డ్రైనేజీ పారుదల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు దీనిలో భాగంగానే ఈ నెల 22న అన్ని గ్రామ సచివాలయం ఆందోళనలు చేపట్టడం జరుగుతుందని అర్హులైన లబ్ధిదారులందరూ వ్యక్తిగతంగా అర్జీలను తీసుకురావాలని దేవుడు సూచించారు